జగ్గయ్యపేట : పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం (తాతయ్య) గురువారం పాల్గొన్నారు. ప్రత్యేక అన్నదానాన్ని లాయర్ రాయపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించగా, ఎమ్మెల్యే స్వయంగా భక్తులకు వడ్డన చేసి సేవ చేశారు.
అయ్యప్ప మాలధారుల కోసం ప్రతిరోజూ శ్రీ వన్ పులి వాహన సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుందని ఆయన తెలిపారు. రోజూ 400–500 మంది అయ్యప్ప స్వాములు, శివయ్య స్వాములు, భవానీ స్వాములు ఈ సేవలో పాల్గొంటున్నారని చెప్పారు. దేవాలయ కమిటీ పర్యవేక్షణలో సేవా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతున్నందుకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు.


