ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల ప్రోత్సాహక దూరదృష్టితో రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జయంతిపురం గ్రామంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమం మంగళవారం ఘనంగాజరిగింది.
ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, ఆర్డీవో బాలకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ,
“ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిశ్రమల విస్తరణకు రాష్ట్రం వేగంగా పునాదులు వేస్తోంది. జయంతిపురంలో ప్రారంభ మవుతున్న ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, జగ్గయ్యపేటను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడంలో మైలురాయిగా నిలుస్తుంది,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగ్గయ్యపేటలో 15 కోట్ల ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భూమి పూజ ఘనంగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల ప్రోత్సాహక దూరదృష్టితో రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జయంతిపురం గ్రామంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమం మంగళవారం ఘనంగాజరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, ఆర్డీవో బాలకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిశ్రమల విస్తరణకు రాష్ట్రం వేగంగా పునాదులు వేస్తోంది. జయంతిపురంలో ప్రారంభ మవుతున్న ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, జగ్గయ్యపేటను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడంలో మైలురాయిగా నిలుస్తుంది,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

