Tuesday, 24 March 2026
  • Home  
  • జగ్గయ్యపేటలో భారీ వర్షాలు – ఎమ్మెల్యే, చైర్మన్ స్వయంగా వరద ప్రదేశాలు పరిశీలన
- ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో భారీ వర్షాలు – ఎమ్మెల్యే, చైర్మన్ స్వయంగా వరద ప్రదేశాలు పరిశీలన

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావంతో జగ్గయ్యపేట పట్టణంలో, ముఖ్యంగా ఆర్టీసీ కాలనీ, వేపల వాగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాలు వరద ముంపు ప్రమాదానికి లోనవుతాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీరంగాపురం రాఘవేంద్ర స్వయంగా ప్రభావితం ప్రాంతాలను పరిశీలించారు. *ఎమ్యెల్యే సూచనలు* : వరద ముంపు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాల (తాత్కాలిక పునరావాస కేంద్రాలు) కు తరలించబడాలి. విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లు దగ్గరగా వెళ్లవద్దు. తాగునీటిని మరిగించి తాగాలి, కలుషిత నీటిని వాడకూడదు. రోడ్లు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయవద్దు; అత్యవసరమైన ప్రయాణమే చేయాలి. పిల్లలు, పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. వార్తలు, వాతావరణ హెచ్చరికల ను తరచుగా గమనించాలి. *చైర్మన్ వ్యాఖ్య* : “ప్రతి ఒక్కరి సురక్షితత్వమే మా మొదటి ప్రాధాన్యత. మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తం గా పనిచేస్తున్నారు. ఏవైనా సమస్యలు ఎదురైన వెంటనే మాకు సమాచారం అందించాలి,” అన్నారు. *ప్రజలకు భరోసా* : జగ్గయ్యపేట మున్సిపాలిటీ అన్ని విధాలా సహాయం అందజేస్తుంది, ప్రజలు ధైర్యంగా ఉండవచ్చు.

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావంతో జగ్గయ్యపేట పట్టణంలో, ముఖ్యంగా ఆర్టీసీ కాలనీ, వేపల వాగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాలు వరద ముంపు ప్రమాదానికి లోనవుతాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీరంగాపురం రాఘవేంద్ర స్వయంగా ప్రభావితం ప్రాంతాలను పరిశీలించారు.
*ఎమ్యెల్యే సూచనలు* :
వరద ముంపు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాల (తాత్కాలిక పునరావాస కేంద్రాలు) కు తరలించబడాలి.
విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లు దగ్గరగా వెళ్లవద్దు. తాగునీటిని మరిగించి తాగాలి, కలుషిత నీటిని వాడకూడదు. రోడ్లు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయవద్దు; అత్యవసరమైన ప్రయాణమే చేయాలి. పిల్లలు, పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి.
వార్తలు, వాతావరణ హెచ్చరికల ను తరచుగా గమనించాలి.
*చైర్మన్ వ్యాఖ్య* :
“ప్రతి ఒక్కరి సురక్షితత్వమే మా మొదటి ప్రాధాన్యత. మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తం గా పనిచేస్తున్నారు. ఏవైనా సమస్యలు ఎదురైన వెంటనే మాకు సమాచారం అందించాలి,” అన్నారు.
*ప్రజలకు భరోసా* :
జగ్గయ్యపేట మున్సిపాలిటీ అన్ని విధాలా సహాయం అందజేస్తుంది, ప్రజలు ధైర్యంగా ఉండవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.