Sunday, 29 March 2026
  • Home  
  • జగన్ రెడ్డిపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఫైర్*
- విశాఖపట్నం

జగన్ రెడ్డిపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఫైర్*

*ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నొక్కేసి నీతులా* *జగన్ రెడ్డిపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఫైర్* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి సీపీఎస్ ఉద్యోగులకు సంబందించిన కంట్రిబ్యూషన్ సొమ్మును, జిపీఎఫ్ సొమ్మును వాడుకోవడమే కాకుండా అడుగడుగునా ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బకొట్టి వారి మధ్య చీలికలు తెచ్చిన మీరు, కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధివిధానాలపై అడిగే హక్కు ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు కూటమి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన డిఏ పై గంటా నూకరాజు స్పందించారు. అనుభవశీలి, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఎంతో ముందు చూపుతో అడుగులు వేసే నాయకుడు, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల రూపకల్పనే ద్యేయంగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదని అన్నారు. ఉద్యోగుల ప్రొవిడెండ్ ఫండ్, కంట్రిబ్యూషన్ సొమ్మును, చివరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు దాచుకున్న సొమ్ములను వాడుకొని పాలన సాగించిన మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు అల్లినట్లు ఉందని అన్నారు. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల డిఏల విషయంలో చంద్రబాబు సర్కార్ సానుకూలంగా ఉందని అన్నారు. ఒకరోజు డిఏ ను ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రకటించడం పట్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తే అధికారంలో ఉండగా ఒక్క డిఏ కూడా ఇవ్వని జగన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఐదేళ్ల పాటు ఉద్యోగులతో చెడుగుడు ఆడుకున్న విషయాన్ని మర్చారా..? అని ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువ ఇచ్చిన సందర్భాలు లేవని అది ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు. పదవీవిరమణ అయితే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని వయసును పెంచిన సంగతి మర్చారా..? అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగ సంఘాలను పొగిడిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ విశ్వరూపం బయటపడిందని అన్నారు. సాక్ష్యాత్ గురువులనే మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన ఘనులని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. డిఏలు, పీఆర్సీ, మెడికల్ బిల్లులు, ఈఎల్స్, సీపీఎస్ కంట్రిబ్యూషన్ ను ఎగ్గొట్టడం.. జీతాలు, పెన్షన్స్ కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడం వంటి దుశ్చర్యలు ఉద్యోగులు మర్చిపోరని గంటా నూకరాజు అన్నారు.

*ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నొక్కేసి నీతులా*

*జగన్ రెడ్డిపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఫైర్*
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి
సీపీఎస్ ఉద్యోగులకు సంబందించిన కంట్రిబ్యూషన్ సొమ్మును, జిపీఎఫ్ సొమ్మును వాడుకోవడమే కాకుండా అడుగడుగునా ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బకొట్టి వారి మధ్య చీలికలు తెచ్చిన మీరు, కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధివిధానాలపై అడిగే హక్కు ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు కూటమి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన డిఏ పై గంటా నూకరాజు స్పందించారు. అనుభవశీలి, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఎంతో ముందు చూపుతో అడుగులు వేసే నాయకుడు, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల రూపకల్పనే ద్యేయంగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదని అన్నారు. ఉద్యోగుల ప్రొవిడెండ్ ఫండ్, కంట్రిబ్యూషన్ సొమ్మును, చివరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు దాచుకున్న సొమ్ములను వాడుకొని పాలన సాగించిన మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు అల్లినట్లు ఉందని అన్నారు. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల డిఏల విషయంలో చంద్రబాబు సర్కార్ సానుకూలంగా ఉందని అన్నారు. ఒకరోజు డిఏ ను ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రకటించడం పట్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తే అధికారంలో ఉండగా ఒక్క డిఏ కూడా ఇవ్వని జగన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఐదేళ్ల పాటు ఉద్యోగులతో చెడుగుడు ఆడుకున్న విషయాన్ని మర్చారా..? అని ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువ ఇచ్చిన సందర్భాలు లేవని అది ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు. పదవీవిరమణ అయితే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని వయసును పెంచిన సంగతి మర్చారా..? అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగ సంఘాలను పొగిడిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ విశ్వరూపం బయటపడిందని అన్నారు. సాక్ష్యాత్ గురువులనే మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన ఘనులని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. డిఏలు, పీఆర్సీ, మెడికల్ బిల్లులు, ఈఎల్స్, సీపీఎస్ కంట్రిబ్యూషన్ ను ఎగ్గొట్టడం.. జీతాలు, పెన్షన్స్ కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడం వంటి దుశ్చర్యలు ఉద్యోగులు మర్చిపోరని గంటా నూకరాజు అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.