సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ ఉపరాష్ట్రపతి ఎన్నికలు:
ఉపరాష్ట్రపతి ఎన్నికలు మద్దతు కోరిన విపక్ష అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి
ఎన్డీయే నాయకులకు ముందే మాట ఇచ్చేశానన్న జగన్
ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగవంతమయ్యాయి. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన జగన్‌ను కోరారు.
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థనకు జగన్ సున్నితంగా బదులిచ్చారు. ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించకముందే ఎన్డీయే నాయకులు తనను సంప్రదించారని, వారికి మద్దతు ఇస్తామని మాట ఇచ్చామని జగన్ వివరించారు. ఈ కారణంగా ఇప్పుడు మీకు (సుదర్శన్ రెడ్డికి) మద్దతు ఇవ్వలేకపోతున్నామని స్పష్టం చేశారు. అయితే, న్యాయమూర్తిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి దేశానికి, ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివని, ఆయనపై తనకు వ్యక్తిగతంగా అపారమైన గౌరవం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన నిర్ణయాన్ని మరోవిధంగా భావించవద్దని జగన్ విజ్ఞప్తి చేశారు


