టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

జగన్ అబద్దాలు, అవినీతి పాలనకు చిహ్నంగా మారాయని పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.
జగన్ హయాంలో విషపూరిత మద్యం వల్ల వేలాది మంది మరణించారని, రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్టు సిట్ నిర్ధారించిందని తెలిపారు.
మెడికల్ కళాశాలలపై జగన్ డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మెడికల్ కాలేజీకి భూమి కూడా ఇవ్వలేని ప్రభుత్వం వైద్య విద్యపై మాట్లాడే హక్కు లేదన్నారు.
జగన్ ప్రజలను మభ్యపెట్టే అబద్దాలు ఇక నమ్మే స్థితిలో లేరని పల్లా స్పష్టం చేశారు.

