ఛలో హైదరాబాద్ నవంబర్ 1న – దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేద్దా,
పోగుల రాజేష్ మాదిగ
MRPS జిల్లా కన్వీనర్
జోగులాంబ గద్వాల జిల్లా (పున్నమి ప్రతినిధి)అక్టోబర్ 31 : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు,పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశానుసారం రేపు నవంబర్ 1న తలపెట్టిన ఛలో హైదరాబాద్ ఆత్మగౌరవ నిరసన ర్యాలీని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ మాదిగ మాట్లాడుతూ….ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఛలో హైదరాబాద్ నవంబర్ 1న దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేయుటకై జిల్లాలోని ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి,అనుబంధ సంఘాల నాయకులు,ప్రజా సంఘాలు,మానవత వాదులు, కార్యకర్తలు,ప్రతి దళిత సోదరుడు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.


