తిరుపతి,
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వ విప్,చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని అభినందించారు. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రణాళిక బద్దంగా వ్యవహరించి అభ్యర్థుల విజయానికి చెవిరెడ్డి కృషి చేశారని, కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 గా ఉన్న సంఖ్యా బలాన్ని చెవిరెడ్డి సమన్వయం చేశారు. కరోనా నేపధ్యంలో పటిష్ట ప్రణాళికతో ఎమ్మెల్యే లందరిని పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వాటిలో ఏ ఒక్క ఓటు వృధా కాకుండా చెవిరెడ్డి చర్యలు చేపట్టారు. అంతే కాకుండా తమకు కేటాయించిన అభ్యర్థులకు ఓట్లు వేసేలా ఎమ్మెల్యేలను సమన్వయ పరచడం, నలుగురు అభ్యర్థులకు సమకాలీన ఓట్లు రావడం, వారి ఘన విజయానికి చెవిరెడ్డి కృషి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి చెవిరెడ్డిని అభినందించారు.