నిర్మల్ నవంబర్ 06 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ జిల్లాలో చిన్న నీటిపారుదల కింద వచ్చే బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, కాలువల వివరాలను సమగ్రంగా సేకరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖాధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా పరిధిలోని అన్ని చిన్న నీటిపారుదల వనరులపై ఖచ్చితమైన సమాచారం సేకరించి, రికార్డులు సక్రమంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీఓ జీవరత్నం, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, నీటిపారుదల వనరుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


