*చిన్నపత్రికల సమస్యలు పరిష్కరిస్తాంః I&PR డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్*
చిన్న,మధ్యతరహాపత్రికల అసోషియేషన్ ప్రతినిధులతో సమావేశమైన డెరెక్టర్
సమగ్రంగా చర్చిన వైనంః సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
*అమరావతి విశాఖ పున్నమి ప్రతినిధి:- * స్మాల్ , మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధ్యక్షుడు కె.ఎస్. రంగసాయి నేతృత్వంలో, బుధవారం ఇక్కడ రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో I&PR డైరెక్టర్‌ను కలిసారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు చిన్న మరియు మధ్య తరహా పత్రికలకు సంబంధించి పలు సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
1. పాత పత్రికలకు జారీ చేసిన PRGI ఆన్‌లైన్ సర్టిఫికేట్‌లు మరియు RNI సర్టిఫికేట్‌లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇకపై నమోదు చేసుకునే కొత్త పత్రికలకు PRGI నుండి జారీచేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను మాత్రమే ఇవ్వాలని సూచించారు.
2. పాత జిల్లాలు మరియు కొత్త జిల్లాలు రెండింటిలోనూ పాత RNI సర్టిఫికేట్‌లను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
3. ప్రతి జిల్లాకు వేర్వేరు RNI సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని వివరించారు.
4. న్యూస్ పేపర్ ఎంపానెల్‌మెంట్‌ను తక్షణం పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని, అలాగే RJDs స్థాయిలో పరిశీలనలో ఉన్న ఫైళ్లను కూడా క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆయన స్పందిస్తూ ఎంపానెల్‌మెంట్ కొరకు వేచి ఉన్న పత్రికల ఎంపానెల్‌మెంట్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరగా, డైరెక్టర్ రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు.
సాధారణంగా పత్రికల ఎంపానెల్‌మెంట్ ప్రతి సంవత్సరం మార్చి మరియు నవంబర్ నెలల్లో జరుగుతుందని, అయితే ఈ నియమాన్ని సడలిస్తూ, ఇప్పటికే ఉన్న ఫైళ్ల ఎంపానెల్‌మెంట్ పూర్తి చేసి, వచ్చే నెలలో ఎంపానెల్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు.
5. మధ్య తరహా పత్రికల విధానం (మిడియం న్యూస్ పేపర్ పాలసీ) త్వరితగతిన రూపొందించాలనీ కోరారు.
6. పాత పత్రికలకు పిఆర్‌జిఐ ప్రింటింగ్ సర్టిఫికెట్ అవసరం లేదని వివరణ ఇచ్చారు. దీనిపై అధికారులకు తాను మార్గదర్శకాలు ఇచ్చానని ఆయన అసోషియేషన్ ప్రతినిధులకు తెలిపారు.
7. ఎంపానెల్ లేని పత్రికల జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై, డైరెక్టర్ సమగ్రంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
8. వార్షిక రిటర్న్‌లతో నమోదు చేసిన రిపోర్టులో ఉన్న CA సర్టిఫికేట్‌లను పరిగణించాలని అభ్యర్థించారు.
9. అక్రిడిటేషన్ G.O.లో 4-8 పేజీల పత్రికలకు ఒక విభాగం, 8 లేదా అంతకంటే ఎక్కువ పేజీల పత్రికలకు మరో విభాగంగా విభజించాలని కోరారు.
10. కేంద్ర విధానానికి అనుగుణంగా ప్రకటనల రేటు కార్డులను పునఃసమీక్షించి పెంచాలని అభ్యర్థించగా తాను దీనిపై అధ్యయనం చేస్తున్నానని, తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అసోషియేషన్ ప్రతినిధులు చెప్పిన సమస్యలపై డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ శ్రద్ధగా విన్నారు. అన్నింటిని వివరంగా రాసుకున్నారు. తరువాత వీటిపై అధికారులతో చర్చించి సమగ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటానని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ రెడ్డి, కోయిలా డ పరశురామ్, కొఠపల్లి, హనుమంతు రావు, రాజధాని వార్తలు హుస్సేన్ ఖాన్, రేపటికోసం పత్రిక ఎడిటర్ శాఖమూరి శ్రీనివాస ప్రసాద్, సత్యాగ్రహం శ్రీనివాస్, ముప్పిరిశెట్టి జగదీశ్, ఉదయ అక్షరం సుబ్బారావు మరియు ఇతరులు పాల్గొన్నారు.


