నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో శ్రీ మహంకాళమ్మ పండుగను మంగళవారం (12 ఆగస్ట్ 2025) నాడు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. పండుగ రోజు ప్రజలు వారి యొక్క ఎడ్లబండ్లను మరియు ట్రాక్టర్లను మహంకాళమ్మ గుడి చుట్టూ త్రిప్పడం
సాంప్రదాయంగా వస్తుందని, ప్రతి శ్రావణమాసంలో మహంకాళమ్మ పండుగను జరుపుకంటారు.
ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాల్లో ఉన్న వారందరు ఊరికి వచ్చి పండుగను తమవారితో
సంతోషంగా జరుపుకున్నారు.

