చిట్వేల్: చిట్వేల్ మండలంలోని పలు పంచాయతీల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ₹3,72,029 విలువైన చెక్కులను లబ్ధిదారుల గృహాలకు స్వయంగా వెళ్లి అందజేశారు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, టీడీపీ పార్టీ ఇంచార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు.
లబ్ధిదారుల వివరాలు:
ననబాల నారాయణ – ₹20,614 (రాజుకుంట)
రాయిని శారదమ్మ కుటుంబం – ₹56,442 (కేకే వడ్డిపల్లి)
తంగుటూరి ప్రేమ్‌కుమార్ – ₹36,608 (వెంకటరాజుపల్లి)
బాలే నాగేశ్వర – ₹59,427 (చిట్వేల్ టౌన్)
నాగ రాజేశ్వరి – ₹34,560 (నాగవరం చొప్పవారిపల్లి)
ఎరబట్టిన వంశీ శంకర్ – ₹43,795 (సి.కందులవారిపల్లి)
యెద్దోటి భాస్కర్ – ₹1,20,583 (మార్గోపల్లి)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ప్రజల అవసర సమయంలో అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.” అన్నారు.
యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ – “ఈ సహాయం లబ్ధిదారుల జీవితంలో వెలుగుని నింపుతుంది. అవసర సమయంలో ప్రజల పక్కన నిలబడే ప్రభుత్వం మనది.” అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


