చిట్వేల్, అక్టోబర్ 3,(పున్నమి ప్రతినిధి)
చిట్వేల్ మండలం నక్కలపల్లి గ్రామ పంచాయతీలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో “సూపర్ జి.ఎస్.టి – సూపర్ సేవింగ్స్” పై రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ జి. సుధాకర్ మాట్లాడుతూ, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్ పరికరాలు, హార్వెస్టర్లు, డ్రోన్లు, డ్రిప్ పరికరాలు వంటి యంత్రాలపై జి.ఎస్.టి.ని 5%కి తగ్గించారని తెలిపారు. దీని వల్ల రైతుల ఖర్చులు తగ్గి, ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని చెప్పారు. అలాగే సుష్మపోషకాలు, బయో-పెస్టిసైడ్స్పై కూడా జి.ఎస్.టి.ని 5%కి తగ్గించినట్లు తెలిపారు.కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చాయని, ఎవరైనా అధిక ధరలకు అమ్మితే 1915 నెంబర్‌కి కాల్ చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో స్టాల్స్, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా, రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి శ్రీ లోకేష్, టిడిపి నాయకులు చంద్రమోహన్, గ్రామ ఉద్యాన సహాయకుడు తిమ్మాయాగారిపల్లి ఓబయ్య, గ్రామ రెవెన్యూ అధికారి భాస్కర్, పంచాయతీ కార్యదర్శి శ్రీమతి జయలత, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.


