చిట్వేల్ పట్టణ అభివృద్ధికి మరొక శుభారంభం లభించింది. పట్టణంలోని సింగనమల వీధి నుండి గాజుల వీధి జంక్షన్ వరకు రూ.42 లక్షల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిమెంట్ రహదారి నిర్మాణ పనులకు గురువారం భూమి పూజ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్, చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మేము మాటలతో కాదు, చేతలతో చూపించే నాయకత్వం అందిస్తున్నాం. ప్రజల సౌకర్యం కోసం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయి,” అని తెలిపారు.
చిట్వేల్ పట్టణాన్ని మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యం అని ముక్కా రూపానంద రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పల్లెలో మట్టి రోడ్ల స్థానంలో సిమెంట్ రహదారులు నిర్మించబోతున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాటల శ్రీనివాస్ రెడ్డి, యువనేత గుత్తి నరసింహ, మార్కెట్ యార్డ్ చైర్మన్ వరలక్ష్మి, బత్తిన వేణుగోపాల్ రెడ్డి, జనసేన నాయకులు మాదాసు నరసింహులు, మద్దూరు మన్మధ, బొంతల నాగేశ్వర, సాయి, మాదాసు శివ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


