చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న ఆర్కే కళ్యాణ మండపంలో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ మరియు మాజీ చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాస రాజు, అతికారి కృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ పగడాల వరలక్ష్మి, రాజుగుంట ఎంపీటీసీ నానబాల నాగార్జున, చిట్వేలి మండలం టిడిపి యువ నాయకుడు రాజుగుంట నరసింహ, సర్పంచ్ కారుమంచి సంయుక్త తదితరులు హాజరుకానున్నారని తెలిపారు.జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని మాదాసు నరసింహ కోరారు.


