పవిత్ర కార్తీక మాసం ఆరంభమై, తొలి సోమవారం సందర్భంగా చిట్వేలిలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్తీక సోమవారం ప్రాధాన్యత దృష్ట్యా, సోమేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏక వార రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో శివలింగానికి అభిషేకం జరిపారు.
అదేవిధంగా, ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామి వారికి మహా మంగళ హారతి ఇచ్చారు. చివరగా, ఆలయ అర్చకులు పవన్ శర్మ, సురేంద్ర శర్మ వేద మంత్రాలను పఠిస్తూ వేద స్వస్తి నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
ఈ విశేష పూజల్లో పాల్గొన్న భక్తులందరూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.


