తొట్టంబేడు నవంబర్ 21, పున్నమి న్యూస్ : చిట్టత్తూరు గ్రామంలో శుక్రవారం నాడు స్వచ్చ గ్రామం హరిత గ్రామం కార్యక్రమంలో తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆద్వర్యంలో మండలం లో అందరూ గ్రీన్ అంబాజీడర్లకు, గ్రీన్ గార్డ్ లకు మురుగునీటి నిలువలను, చెత్తను తొలగించడంపై ఒక్క రోజు శిక్షణను ఇవ్వడమైనది. ఇందులో భాగంగా చిట్టత్తూరు గ్రామం లోని, మురుగునీటిని, చెత్తకుప్పలను పిచ్చి మొక్కలను తొలగించి వీధులను, గ్రామ పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగినది. స్వచ్చమైన గ్రామంగా తీర్చేందుకు ప్రతి మనిషి ఆరోగ్యం, అభివృద్ధికి పునాదిగా, చెత్త లేకుండా, కాలుష్యం లేకుండా, పరిశుభ్రతతో ఉంచుకోవాలని, ప్లాస్టిక్ ను వాడకుండా నిషేదించాలని, స్వచ్ఛమైన గాలి కొరకు ప్రతి ఇంటి ఆవరణలోను చెట్లను పెంచాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. సురేంద్రనాధ్ ప్రజలకు సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమం లో ETC, ప్రిన్సిపాల్ విద్యారమ సీనియర్ ప్యాకల్టీలు రూపారాణి, మధుసూధన్ లు ఉపమండల పరిషత్ అభివృద్ధి అధికార్లు గిరిధర్, భార్గవ సత్యం, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, మండలం లోని పంచాయితీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చిట్టత్తూరులో స్వచ్చ గ్రామం హరిత గ్రామ కార్యక్రమం