Story highlights
- నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో ఉన్న అభిషిక్తుని ఆశీర్వాద ప్రార్థన మందిరాన్ని (చర్చ్) వైఎస్సార్ నగర్ టీడీపీ ఇన్‌చార్జ్ తాటికొండ బుగ్గ రాముడు ఆహ్వానం మేరకు నాయకుడు గోళ్ళ రాజేష్ సందర్శించారు.
- ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి ప్రజల అవసరాల కోసం బాడీ ఫ్రీజర్ కొనుగోలుకు, క్రిస్టియన్ల స్మశాన వాటిక (బరిగెల్ గ్రౌండ్) ఫెన్సింగ్ గోడ నిర్మాణం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహకార చెక్కును ఆయన పాస్టర్లకు అందజేశారు.గడిచిన 16 ఏళ్లలో తమ చర్చికి ఆర్థిక సాయం అందించిన…
- కులమతాలకు అతీతంగా పేదలకు సహాయ సహకారాలు అందించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని గోళ్ళ రాజేష్ తెలిపారు.
నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో ఉన్న అభిషిక్తుని ఆశీర్వాద ప్రార్థన మందిరాన్ని (చర్చ్) వైఎస్సార్ నగర్ టీడీపీ ఇన్‌చార్జ్ తాటికొండ బుగ్గ రాముడు ఆహ్వానం మేరకు నాయకుడు గోళ్ళ రాజేష్ సందర్శించారు. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి ప్రజల అవసరాల కోసం బాడీ ఫ్రీజర్ కొనుగోలుకు, క్రిస్టియన్ల స్మశాన వాటిక (బరిగెల్ గ్రౌండ్) ఫెన్సింగ్ గోడ నిర్మాణం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహకార చెక్కును ఆయన పాస్టర్లకు అందజేశారు.గడిచిన 16 ఏళ్లలో తమ చర్చికి ఆర్థిక సాయం అందించిన ఏకైక వ్యక్తి గోళ్ళ రాజేష్ మాత్రమేనని, ఆయన సేవలను కొనియాడుతూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పేదలకు సహాయ సహకారాలు అందించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని గోళ్ళ రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దైవసేవకులు డి.పాల్ జోసఫ్, బాలరాజు, కాలేబు, జయరాజు, ఇజ్రాయిల్, లాజర్ తదితరులు పాల్గొన్నారు.