Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nandyal

రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

Punnami Newsroom Published:
రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

Story highlights

  • నంద్యాల:జిల్లాలో రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు.
  • గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 22-A జాబితా సవరణలు, రీ–సర్వే, డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, మ్యుటేషన్లపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ..
  • 5వ విడత రీ–సర్వేలో గ్రౌండ్ ట్రూథింగ్ (GT) పనులను ఆగస్టు 31 నాటికి, నిలిచిపోయిన DLR పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

నంద్యాల:జిల్లాలో రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 22-A జాబితా సవరణలు, రీ–సర్వే, డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, మ్యుటేషన్లపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. 5వ విడత రీ–సర్వేలో గ్రౌండ్ ట్రూథింగ్ (GT) పనులను ఆగస్టు 31 నాటికి, నిలిచిపోయిన DLR పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిఫెక్టెడ్ గ్రామాల్లో రీ–సర్వేను వేగవంతం చేసేందుకు తహశీల్దార్లు, సర్వేయర్లకు వర్చువల్ విధానంలో ఓరియంటేషన్ నిర్వహిస్తామన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా నివేదికలను మండల స్థాయి నుంచే జాయింట్ కలెక్టర్‌ కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *