అట్టహాసంగా..
* చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
* నిబద్ధత, అవగాహన కలిగిన పాలక మండలి
* ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి,
- చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో అట్టహాసంగా సాగింది. మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా మస్తాన్, ఉపాధ్యక్షులుగా కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో పద్నాలుగు మంది సభ్యులచే గౌరవ అధ్యక్షులు హోదాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం మార్కెట్ యార్డ్ వేదికగా పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. రైతు సమస్యలపై అవగాహన, పరిష్కరించడంలో నిబద్ధత కలిగిన సభ్యులు పాలకమండలి లో ఉన్నారని తెలియజేశారు. రాష్ట్రంలోనే చంద్రగిరి మార్కెట్ యార్డ్ అతి త్వరలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతే రాజు దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎర్ర వారిపాలెం, చిన్నగొట్టి గాల్లు, చంద్రగిరి మండలాల పరిధిలోని రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని పాలక మండలి సభ్యులకు తెలియజేశారు. రైతులకు 24×7 అందుబాటులో ఉంటారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ని పాలకమండలి చైర్మెన్ మస్తాన్, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి నాగలిని బహూకరించి, గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పూర్తితో రైతులకు సేవలు అందిస్తామని నూతన పాలకమండలి సభ్యులు స్పష్టం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సహదేవ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీవో రాధ తదితరులు పాల్గొన్నారు
.