కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో అంతమంది చనిపోవడం, దేశమంతా ఉలిక్కిపడిందని, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వైసిపి సోషల్ మీడియా నాయకుడు జిల్లెల్ల ఉదయ్ కిరణ్ వాపోయారు. ప్రయివేటు బస్సులు భద్రత విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మల్కిపురం నుండి ప్రతిరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఎపిఎస్ ఆర్టిసి ఇంద్ర బస్సు సర్వీసులను నడుపుతోందని, ఈ సర్వీసులో కొన్ని పాత వాహనాలు పలుమార్లు ప్రయాణం మధ్యలో రిపేర్లు గురవుతున్నాయన్నారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న కాలం చెల్లిన బస్సులను మార్చి, కొత్త బస్సులను ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

ఘోర బస్సు ప్రమాదంతో అంతమంది చనిపోవడం చాలా బాధాకరం YSRCP జిల్లెల్ల ఉదయ్ కిరణ్