పున్నమి నవంబరు 05
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామంలో 1200 వ సంవత్సరానికి చెందిన రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకు న్నారు. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధనలతో ఆలయాల్లో పూజలు నిర్వహిస్తు వస్తున్నారు. భక్తులు వేకువజామునే కార్తీక స్నానాలు ఆచరించి అక్కడికి వెళ్లి కాగడ హారతి, దీపారాధన పూజల్లో పాల్గొంటుండడంతో ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక కొత్తపేట శివాలయంల్లో కార్తీక మాస పూజలతో , దీపారాధన ఉత్సవాలు కొనసాగాయి. అదేవిధంగా, సంధ్య రాత్రివేళల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. దీపారాధన వెలిగించి తమ ఇంటి దేవతకు పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో నోములు నిర్వహించుకున్నారు. అదేవిధంగా, పలు ఆలయాలు, మండలంలోని ఆయా గ్రామాల్లో కార్తీక దీపోత్సవం. కార్యక్రమని మహిళలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు. దుత్తలూరు మండలంలోని పలు దేవాలయాల వద్ద భక్తులు కార్తీక జ్యోతులను వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దేవస్థానం చాలా మహిమలు కలిగిన దేవస్థానం అని తెలియజేశారు ఈ దేవస్థానాన్ని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేస్తే బాగుంటుందని తెలియజేశారు



1 Comment
KAKARLA MURALI
November 5, 2025Good