నందలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో శుక్రవారం భాగంగా నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో ఎందరో మహానుభావులు అమరవీరుల త్యాగ ఫలీతమే బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వతంత్ర దినోత్సవంఅన్నారు భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది పారిశుద్ధ కార్మికులు. వార్డు సభ్యులు నాగేంద్ర ఆదినారాయణ ప్రసాద్ గంగాధర్ సుబ్బ నరసయ్య మారే శివకుమార్ . తెలుగుదేశం కూటమి నాయకులు ఆదినారాయణ కాన కుర్తి వెంకటయ్య మట్టి బాబు తుమ్మది శివకుమార్ మౌలా మెహర్ పో మ్మల శివ నరసింహలు సురేష్ శివశంకర్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.


