సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి వేడుకలు మంగళవారం సీతారామపురం లో మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జాయింట్ సెక్రెటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు ఆధ్వర్యంలో యువత భారీగా పాల్గొని వైయస్సార్ వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. సీతారామపురం బస్టాండ్ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంచిపెట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ,108 అంబులెన్స్ , రైతులకు ఉచిత కరెంటు, జల యజ్ఞం వంటి పథకాలతో పేద ప్రజలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరయ్యాడని అయితే ఆయన అకాల మరణం యావత్ రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని, ఆయన ప్రజల గుండెల్లో అమరుడై నిలిచాడన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం బిట్ – 1 ఎంపీటీసీ పీసీ అల్లూరు రాజు, మాజీ వైస్ ఎంపీపీ రామిశెట్టి తిరుపతయ్య, అయ్యవారిపల్లి సర్పంచ్ చింతన బోయిన దుర్గయ్య, వైఎస్ఆర్సిపి మండల ప్రధాన కార్యదర్శి బాలినేని మాబయ్య, వైసీపీ నాయకులు పొట్టి రామచంద్రయ్య, ధనార్జన్, సరస్వతి నారాయణ రాజు, పాలగిరి నవీన్, ఏనుగుల రూపేష్, ఆరేళ్ల కాశి యాదవ్, కలివెల సతీష్, జైపాల్, మంకెన సురేంద్ర, గిరి, కటారి శ్రీనివాసులు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


