పున్నమి ప్రతినిధి ( శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ పల్లిపాడులో కళా ఉత్సవ్ 2025 జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగిసాయి. మొదటి రోజు అనగా 11వ తేదీన గురువారం రోజున గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం మొదలైన కళలలో వ్యక్తిగత మరియు బృంద విభాగాలలో జిల్లాలోని విద్యాసంస్థలలో చదువుతున్న 9, 10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు చురుకుగా పాల్గొని అనేక బహుమతులను గెలుచుకున్నారు. రెండవ రోజున అనగా 12వ తేదీన నాటక కళ, చిత్రకళ, శిల్పకళ, సాంప్రదాయ కథావిన్యాసం మొదలైన కళలలో వ్యక్తిగత మరియు బృంద విభాగాలలో పాల్గొని అనేక బహుమతులను గెలుచుకున్నారు.ప్రథమ బహుమతి సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. విజేతలకు ప్రమాణ పత్రాలు మరియు జ్ఞాపికలను సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు గారు బహుకరించారు. ఈ కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్ మరియు ఆర్గనైజర్స్ శ్రీమతి రజిని గారు, శ్రీమతి హైమావతి గారు, శ్రీ అక్కిరెడ్డి గారు, శ్రీ రఘు కుమార్ గారు, శ్రీ నటరాజమూర్తి గారు, శ్రీ డాక్టర్ బంకా శ్రీనివాసులు గారు, శ్రీ శామీర్ గారు, శ్రీమతి నీరజ గారు, శ్రీమతి పద్మజ గారు, శ్రీమతి ముక్తహర్ సుల్తానా గారు, శ్రీ కోట శీనయ్య గారు, శ్రీ సుబ్బారావు గారు మరియు చాత్రోపాధ్యాయులు తదితరులు ఘనంగా నిర్వహించారు.


