భువనగిరి, సెప్టెంబర్ 20 : భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళా విద్యార్థులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. బతుకమ్మను ఏడు రకాల పువ్వులతో ఆలయ గోపురం ఆకారం లో ఏడు పొరలుగా సాక్షాత్ ఆ మాతృదేవత
మహాగౌరీని ప్రతిబింబించేలా అలంకరించారు.
అనంతరం రంగురంగుల బతుకమ్మలను పేర్చి అందరు కలిసి ఎంతో ఉత్సాహంగా గౌరమ్మను కొలుస్తూ దాండియా పాటలు పాడుతూ బతుకమ్మ గీతాలు ఆలపించారు. పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను గూర్చి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయా లకు ప్రతీకగా నిలిచేది కేవలం బతుకమ్మ పండుగ మాత్రమే అని అన్నారు.బంధాలు, అనుబంధా లను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగా ణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికిచాటి చెప్పే పండుగే బతుకమ్మ పండుగ అని అన్నారు. ఇది పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ, తొమ్మిది రోజులు పాటు ఆడిపాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ మాత్రమేననే విషయాన్ని విద్యార్థులు గుర్తించాల న్నారు.మన సంస్కృతి, సంప్రదాయాలను ఇదే విధంగా రక్షించుకుంటు భవిష్యత్ తరాలకు అందించాలని ప్రిన్సిపాల్ విద్యార్థులను కోరారు..ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు..

ఘనంగా బతుకమ్మ సంబరాలు
భువనగిరి, సెప్టెంబర్ 20 : భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళా విద్యార్థులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. బతుకమ్మను ఏడు రకాల పువ్వులతో ఆలయ గోపురం ఆకారం లో ఏడు పొరలుగా సాక్షాత్ ఆ మాతృదేవత మహాగౌరీని ప్రతిబింబించేలా అలంకరించారు. అనంతరం రంగురంగుల బతుకమ్మలను పేర్చి అందరు కలిసి ఎంతో ఉత్సాహంగా గౌరమ్మను కొలుస్తూ దాండియా పాటలు పాడుతూ బతుకమ్మ గీతాలు ఆలపించారు. పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను గూర్చి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయా లకు ప్రతీకగా నిలిచేది కేవలం బతుకమ్మ పండుగ మాత్రమే అని అన్నారు.బంధాలు, అనుబంధా లను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగా ణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికిచాటి చెప్పే పండుగే బతుకమ్మ పండుగ అని అన్నారు. ఇది పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ, తొమ్మిది రోజులు పాటు ఆడిపాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ మాత్రమేననే విషయాన్ని విద్యార్థులు గుర్తించాల న్నారు.మన సంస్కృతి, సంప్రదాయాలను ఇదే విధంగా రక్షించుకుంటు భవిష్యత్ తరాలకు అందించాలని ప్రిన్సిపాల్ విద్యార్థులను కోరారు..ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు..

