Wednesday, 18 March 2026
  • Home  
  • ఘనంగా జరిగిన జాతీయ కవి సమ్మేళనం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా జరిగిన జాతీయ కవి సమ్మేళనం

మార్చి18 @ వెంకటాచలం (నెల్లూరు) సమీపంలో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా శతాధిక జాతీయ కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సుమారు 200కు పైగా కవులు రచయితలు పాల్గొని ఉగాది సందర్భంగా వివిధ సామాజిక అంశాలతో తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు పై మక్కువ పెరుగుతుందని, సుదీర్ఘ ప్రాంతాల నుండి ఇంతమంది కవులు పాల్గొనడం చాలా సంతోషించదగిన విషయమని అందరినీ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఎం. సంపత్ కుమార్, అధ్యయనకేంద్ర సిబ్బంది, ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (బాల సాహిత్యంలో) పొందిన డా. గంగిశెట్టి శివకుమార్, డా. బద్రి పీర్ కుమార్ తదితర కవులు , రచయితలు పాల్గొన్నారు.

మార్చి18 @ వెంకటాచలం (నెల్లూరు)
సమీపంలో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా శతాధిక జాతీయ కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సుమారు 200కు పైగా కవులు రచయితలు పాల్గొని ఉగాది సందర్భంగా వివిధ సామాజిక అంశాలతో తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు పై మక్కువ పెరుగుతుందని, సుదీర్ఘ ప్రాంతాల నుండి ఇంతమంది కవులు పాల్గొనడం చాలా సంతోషించదగిన విషయమని అందరినీ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఎం. సంపత్ కుమార్, అధ్యయనకేంద్ర సిబ్బంది, ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (బాల సాహిత్యంలో) పొందిన డా. గంగిశెట్టి శివకుమార్, డా. బద్రి పీర్ కుమార్ తదితర కవులు , రచయితలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.