Monday, 23 March 2026
  • Home  
  • *ఘనంగా క్రిస్మస్ వేడుకలు* *ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్*
- చిత్తూరు

*ఘనంగా క్రిస్మస్ వేడుకలు* *ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్*

*ఘనంగా క్రిస్మస్ వేడుకలు* *ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్* *కేక్ కటింగ్, దుస్తుల పంపిణి చేసి శుభాకాంక్షలు వ్యక్తం* *ప్రభువు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే* పలమనేరులో క్రిస్మస్ పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని చర్చిలు కిటకిటలాడాయి. పలమనేరు పట్టణంలోని సిఎస్ఐ (ఓల్డ్ ) చర్చ్ నందు, కొత్త సిఎస్ఐ చర్చ్ మరియు శ్రీనగర్ కాలనీలోని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో శాసన సభ్యులు అమరనాథ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలసి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎలిజర్, మున్సిపల్ కౌన్సిలర్ సునీతా నాగరాజు గారి స్వగృహలలో జరిగిన వేడుకల్లో సైతం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరులతో కలిసి కేకులను కట్ చేసి అందరికీ పంచిపెట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ నందు పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ పండుగను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ చల్లని కృప మరియు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో రాణించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమాలలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కుట్టి, గిరి బాబు, సుబ్రహ్మణ్యం గౌడు, సుదర్శన్ బాలాజీ, కృష్ణమూర్తి గౌడు,రూపేష్, మదన్, శ్రీధర్, సుధాకర్, రమేష్, సురేష్, చిన్నీ, సుబ్బు, శీనా జనసేన నాయకులు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

*ఘనంగా క్రిస్మస్ వేడుకలు*

*ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్*

*కేక్ కటింగ్, దుస్తుల పంపిణి చేసి శుభాకాంక్షలు వ్యక్తం*

*ప్రభువు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే*

పలమనేరులో క్రిస్మస్ పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని చర్చిలు కిటకిటలాడాయి. పలమనేరు పట్టణంలోని సిఎస్ఐ (ఓల్డ్ ) చర్చ్ నందు, కొత్త సిఎస్ఐ చర్చ్ మరియు శ్రీనగర్ కాలనీలోని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో శాసన సభ్యులు అమరనాథ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలసి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎలిజర్, మున్సిపల్ కౌన్సిలర్ సునీతా నాగరాజు గారి స్వగృహలలో జరిగిన వేడుకల్లో సైతం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరులతో కలిసి కేకులను కట్ చేసి అందరికీ పంచిపెట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ నందు పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ పండుగను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ చల్లని కృప మరియు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో రాణించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమాలలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కుట్టి, గిరి బాబు, సుబ్రహ్మణ్యం గౌడు, సుదర్శన్ బాలాజీ, కృష్ణమూర్తి గౌడు,రూపేష్, మదన్, శ్రీధర్, సుధాకర్, రమేష్, సురేష్, చిన్నీ, సుబ్బు, శీనా జనసేన నాయకులు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.