Monday, 23 March 2026
  • Home  
  • ఘనంగా ఐఐఏఎం బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025
- విశాఖపట్నం

ఘనంగా ఐఐఏఎం బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025

విద్యార్థులు తమ ప్రతిభనుచాటి ప్రపంచంలో భారత్ ని ప్రధమస్థానంలో నిలపాలి. తల్లి దండ్రులు, గురువుల ఋణం తీర్చుకోలేనిది. సినీ యాక్టర్ సుమన్ ఘనంగా ఐఐఏఎం బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025 జీవితకాలం తమ జీవితాన్ని త్యాగం చేస్తూ అన్నీ తామై ముందుకు నడిపించిన తల్లి దండ్రులను, విద్యా బుద్ధులు నేర్పిన గురువుల ఋణం తీర్చు కోలేమని, విద్యార్థులు తమ, ప్రతిభా, ప్రావిణ్యాలని చాటి ప్రపంచ స్థాయిలో భారత్ ను ప్రధమ స్థానంలో నిలపాలని సినీహీరో సుమన్ అన్నారు. ఎంవీపీ కాలనీలోని’ ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్’ (ఐ ఐ ఏ ఎం) క్యాంపెస్ లో ఆదివారంనాడు “అల్యూమిని మీట్ 2025 “లో సుమన్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఐఐఎఎం బిజినెస్ స్కూల్ అధినేత డా. ఎస్ పి రవీంద్ర మాట్లాడుతూ అత్యున్నత విలువలు, ఉన్నతాశయాలతో తన తండ్రి ఆళ్వార్ దాస్ స్థాపించిన తమ విద్యాసంస్థలలో విద్యని అభ్యసించి నేడు అత్యున్నత స్థానాలకెదిగిన 38 బ్యాచ్ లు పాల్గొనడం ఆనందనీయమన్నారు. కార్యక్రమంలో ఐఐఎఎం డైరెక్టర్ జనరల్ ఆచార్య కృష్ణ మోహన్,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా రెండు రోజులు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు “రీ-యునైట్, ఇంట్రాక్ట్ & హావ్ ఫన్” అనే థీమ్‌తో మళ్లీ పూర్వ విద్యార్థులంతా ఒక చోటచేరి వారి ఎదుగుదలను, అనుభవాలను పంచుకుంటూ, కొత్త అవకాశాలపై చర్చిస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ మీట్ కోసం నిర్వాహకులు ఐఐఎఎం బిజినెస్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేజ ముత్యం ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను అందుబాటులో ఉంచారు.

విద్యార్థులు తమ ప్రతిభనుచాటి ప్రపంచంలో భారత్ ని ప్రధమస్థానంలో నిలపాలి.

తల్లి దండ్రులు, గురువుల ఋణం తీర్చుకోలేనిది.

సినీ యాక్టర్ సుమన్

ఘనంగా ఐఐఏఎం బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025

జీవితకాలం తమ జీవితాన్ని త్యాగం చేస్తూ అన్నీ తామై ముందుకు నడిపించిన తల్లి దండ్రులను, విద్యా బుద్ధులు నేర్పిన గురువుల ఋణం తీర్చు కోలేమని, విద్యార్థులు
తమ, ప్రతిభా, ప్రావిణ్యాలని చాటి ప్రపంచ స్థాయిలో భారత్ ను ప్రధమ స్థానంలో నిలపాలని సినీహీరో సుమన్ అన్నారు.

ఎంవీపీ కాలనీలోని’ ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్’ (ఐ ఐ ఏ ఎం) క్యాంపెస్ లో ఆదివారంనాడు “అల్యూమిని మీట్ 2025 “లో సుమన్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.

ఐఐఎఎం బిజినెస్ స్కూల్ అధినేత డా. ఎస్ పి రవీంద్ర మాట్లాడుతూ అత్యున్నత విలువలు, ఉన్నతాశయాలతో తన తండ్రి ఆళ్వార్ దాస్ స్థాపించిన తమ విద్యాసంస్థలలో విద్యని అభ్యసించి నేడు అత్యున్నత స్థానాలకెదిగిన 38 బ్యాచ్ లు
పాల్గొనడం ఆనందనీయమన్నారు.
కార్యక్రమంలో ఐఐఎఎం డైరెక్టర్ జనరల్ ఆచార్య కృష్ణ మోహన్,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

ప్రతిష్టాత్మకంగా రెండు రోజులు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు “రీ-యునైట్, ఇంట్రాక్ట్ & హావ్ ఫన్” అనే థీమ్‌తో మళ్లీ పూర్వ విద్యార్థులంతా ఒక చోటచేరి వారి ఎదుగుదలను, అనుభవాలను పంచుకుంటూ, కొత్త అవకాశాలపై చర్చిస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ మీట్ కోసం నిర్వాహకులు ఐఐఎఎం బిజినెస్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేజ ముత్యం ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను అందుబాటులో ఉంచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.