Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

ఘనంగా ఉక్కు సత్యాగ్రహి అమృతరావు 106 వ జయంతి వేడుకలు

Punnami Newsroom Published:
ఘనంగా ఉక్కు సత్యాగ్రహి అమృతరావు 106 వ జయంతి వేడుకలు

పున్నమి న్యూస్, అగనంపూడి అక్టోబర్ 22:

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకోం: కార్మిక సంఘాల నేతల హెచ్చరిక..
​సొంత గనులు కేటాయించాలి.. లేదా ‘సెయిల్’లో విలీనం చేయాలి..
విశాఖ ఉక్కు సాధన కోసం 23 రోజుల పాటు నిరంతరాయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉక్కు సత్యాగ్రహి, స్వర్గీయ తమనంపల్లి అమృతరావు 106వ జయంతి వేడుకలను మంగళవారం ఉక్కునగరం అమృతరావు పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కులోని అమృతరావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అమృతరావు జయంతి వేడుకల నిర్వహణ కమిటీ కన్వీనర్ జెర్రిపోతుల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ఉక్కు కార్మిక సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు.
​32 మంది ప్రాణత్యాగాల ఫలితం విశాఖ ఉక్కు:
కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం తమనంపల్లి అమృతరావు అకుంఠిత దీక్షతో పాటు 32 మంది అమరుల ప్రాణత్యాగాలతో, రాజకీయాలకు అతీతంగా ప్రజలు, కార్మికులు పోరాడి సాధించుకున్న ఏకైక కర్మాగారమని గుర్తుచేశారు. అటువంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర పాలకులు నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేపట్టడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్‌లో ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించి, ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెంచారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్లాంట్‌లోని అన్ని విభాగాల్లో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి మరమ్మతులు చేయించి, కార్మికుల భద్రతా చర్యలను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.
​కేంద్ర పాలకుల ద్వంద్వ వైఖరి:
గత ఎన్నికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన పాలకులు, అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా ‘దీపమ్’ (DIPAM) ద్వారా ప్రైవేటీకరణ నిలిపివేతపై అధికారిక ప్రకటన చేయించకపోవడం వారి చిత్తశుద్ధికే పెద్ద ప్రశ్నగా మారిందని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కుతో పాటు దీపమ్ పరిధిలోకి తెచ్చిన మరో 4 కర్మాగారాల ప్రైవేటీకరణను నిలిపివేసి, వాటి పునరుద్ధరణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని, కేవలం విశాఖ ఉక్కు మాత్రమే నేడు గడ్డు కాలాన్ని ఎదుర్కొనేలా చేయడం కేంద్ర పాలకుల వివక్షాపూరిత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. విశాఖ ఉక్కు మనుగడ సాగించాలంటే తక్షణమే సొంత ఇనుప గనులు కేటాయించాలని, లేనిపక్షంలో సెయిల్ (SAIL) లో విలీనం చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
​కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో ఉక్కు నాయకులు డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ బి. గంగారాం, విల్లా రామ్మోహన్ కుమార్, మాటూరి శ్రీనివాసరావు, బలిరెడ్డి సత్యనారాయణ, నీరుకొండ రామచంద్రరావు, కోరాడ వెంకట్రావు, బి. అప్పారావు, చీకటి శ్రీను, ధర్మిరెడ్డి దేవుడు, వైటీదాస్, ఎం. కృష్ణయ్య, బీఎంకే నాయక్, గంగవరం గోపి, అట్టా అప్పారావు, నీళ్లాటి రాజు, ప్రవీణ్ చంద్ర, వర్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా ఉక్కు సత్యాగ్రహి అమృతరావు 106 వ జయంతి వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *