Sunday, 5 April 2026
  • Home  
  • ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగమహేశ్వర సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం
- కర్నూలు

ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగమహేశ్వర సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం

పున్నమి ప్రతినిధి కర్నూల్ జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ​శ్రీశైలంలో వీరశైవ ఆగమ పద్ధతులే పాటించాలి: రాష్ట్ర అధ్యక్షులు జేపీ మల్లికార్జునయ్య కర్నూలు టౌన్ బంగారు పేటలోని MRB ట్రేడ్ సహాయ్ కన్సల్టెన్సీ కార్యాలయంలో జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ మరియు శ్రీశైల క్షేత్రంలోని సంప్రదాయాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ​ప్రధానాంశాలు: ​శ్రీశైలంలో సంప్రదాయాల రక్షణ: శ్రీశైల దేవస్థానంలో వీరశైవ ఆగమ ప్రకారమే కార్యక్రమాలు జరగాలని, వైకుంఠ ఏకాదశి పేరుతో వైకుంఠ ద్వారం ఏర్పాటు చేయడం సరికాదని, దానికి బదులు కైలాస ద్వారం ఏర్పాటుపై ఆలోచించాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. ​అర్చకుల బదిలీపై చర్చ: రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేసినట్లుగానే, శ్రీశైలంలోని తెలంగాణ ప్రాంత అర్చకులను కూడా బదిలీ చేయాలని, రాయలసీమ ప్రాంత వీరశైవ అర్చకులకే ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ​జగద్గురువుల పర్యవేక్షణ: శ్రీశైలంలో ప్రతి కార్యక్రమం పండితారాధ్య జగద్గురువుల ఆధ్వర్యంలోనే జరగాలని, ఆలయ అధికారులు జగద్గురువులతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోరాదని ఇతవు పలికారు. అలాగే మల్లికార్జునయ్య సమాధిపై రాతి మండపం నిర్మించాలని కోరారు. ​సంఘం అభివృద్ధిపై నేతల పిలుపు: ​సంఘం ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని, సభ్యుల నుంచి విరాళాలు సేకరించి అభివృద్ధి పనులకు వెచ్చించాలని ప్రధాన కార్యదర్శి మహర్షి విజయ్ కుమార్ సూచించారు. జంగమహేశ్వరులు అయాచార దీక్షలు చేపట్టాలని కోరారు. ​కులగణనపై అప్రమత్తత: ​ఉప కోశాధికారి R. శివకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో తలుపులు వేసి ఉన్న ఇళ్లను వదిలేయకుండా, సరైన మార్గంలో ప్రతి ఇంటిని లెక్కించాలని, కులగణన సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. ​ఐక్యతాయే లక్ష్యం: ​సంఘంలో ఎలాంటి మనస్పర్థలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలని గౌరవ అధ్యక్షులు కె.వి. నాగేశ్వరయ్య, టౌన్ ప్రెసిడెంట్ R. మల్లేశ్వరయ్య కోరారు. కొందరు వ్యక్తులు సంఘాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారని, వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఒకే విధానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ​పాల్గొన్న ముఖ్యులు: ఈ సమావేశంలో కోశాధికారి చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు చెన్న బసయ్య, చంద్రయ్య, ఉపాధ్యక్షులు నటరాజ్, N. గంగాధర శాస్త్రి, రామలింగయ్య, R. శివకుమార్ మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే యు.ఎమ్ రుద్రయ్య గారికి జ్యోతిష్య రత్న అవార్డు వచ్చిన సందర్భంగా రాష్ట్ర నాయకులు శాలువాతో సన్మానించి గౌరవించారు పాదయాత్రలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు గాను మహర్షి విజయ్ కుమార్ కి శాలువాతో ఘనంగా సత్కరించారు మరియు కవిగా అనేక ప్రశంసలు అందుకున్న కె.వి నాగేశ్వరయ్య వారిని కూడా ఘనంగా సత్కరించారు

పున్నమి ప్రతినిధి కర్నూల్
జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం
​శ్రీశైలంలో వీరశైవ ఆగమ పద్ధతులే పాటించాలి: రాష్ట్ర అధ్యక్షులు జేపీ మల్లికార్జునయ్య
కర్నూలు టౌన్ బంగారు పేటలోని MRB ట్రేడ్ సహాయ్ కన్సల్టెన్సీ కార్యాలయంలో జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ మరియు శ్రీశైల క్షేత్రంలోని సంప్రదాయాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
​ప్రధానాంశాలు:
​శ్రీశైలంలో సంప్రదాయాల రక్షణ: శ్రీశైల దేవస్థానంలో వీరశైవ ఆగమ ప్రకారమే కార్యక్రమాలు జరగాలని, వైకుంఠ ఏకాదశి పేరుతో వైకుంఠ ద్వారం ఏర్పాటు చేయడం సరికాదని, దానికి బదులు కైలాస ద్వారం ఏర్పాటుపై ఆలోచించాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.
​అర్చకుల బదిలీపై చర్చ: రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేసినట్లుగానే, శ్రీశైలంలోని తెలంగాణ ప్రాంత అర్చకులను కూడా బదిలీ చేయాలని, రాయలసీమ ప్రాంత వీరశైవ అర్చకులకే ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
​జగద్గురువుల పర్యవేక్షణ: శ్రీశైలంలో ప్రతి కార్యక్రమం పండితారాధ్య జగద్గురువుల ఆధ్వర్యంలోనే జరగాలని, ఆలయ అధికారులు జగద్గురువులతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోరాదని ఇతవు పలికారు. అలాగే మల్లికార్జునయ్య సమాధిపై రాతి మండపం నిర్మించాలని కోరారు.
​సంఘం అభివృద్ధిపై నేతల పిలుపు:
​సంఘం ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని, సభ్యుల నుంచి విరాళాలు సేకరించి అభివృద్ధి పనులకు వెచ్చించాలని ప్రధాన కార్యదర్శి మహర్షి విజయ్ కుమార్ సూచించారు. జంగమహేశ్వరులు అయాచార దీక్షలు చేపట్టాలని కోరారు.
​కులగణనపై అప్రమత్తత:
​ఉప కోశాధికారి R. శివకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో తలుపులు వేసి ఉన్న ఇళ్లను వదిలేయకుండా, సరైన మార్గంలో ప్రతి ఇంటిని లెక్కించాలని, కులగణన సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు.
​ఐక్యతాయే లక్ష్యం:
​సంఘంలో ఎలాంటి మనస్పర్థలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలని గౌరవ అధ్యక్షులు కె.వి. నాగేశ్వరయ్య, టౌన్ ప్రెసిడెంట్ R. మల్లేశ్వరయ్య కోరారు. కొందరు వ్యక్తులు సంఘాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారని, వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఒకే విధానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
​పాల్గొన్న ముఖ్యులు:
ఈ సమావేశంలో కోశాధికారి చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు చెన్న బసయ్య, చంద్రయ్య, ఉపాధ్యక్షులు నటరాజ్, N. గంగాధర శాస్త్రి, రామలింగయ్య, R. శివకుమార్ మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే యు.ఎమ్ రుద్రయ్య గారికి జ్యోతిష్య రత్న అవార్డు వచ్చిన సందర్భంగా రాష్ట్ర నాయకులు శాలువాతో సన్మానించి గౌరవించారు పాదయాత్రలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు గాను మహర్షి విజయ్ కుమార్ కి శాలువాతో ఘనంగా సత్కరించారు మరియు కవిగా అనేక ప్రశంసలు అందుకున్న కె.వి నాగేశ్వరయ్య వారిని కూడా ఘనంగా సత్కరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.