Monday, 23 March 2026
  • Home  
  • ఘనంగా అష్టాదశ దుర్గామాత విగ్రహాల నిమజ్జనం
- కామారెడ్డి

ఘనంగా అష్టాదశ దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

కామారెడ్డి, 04 అక్టోబర్ పున్నమి ప్రతినిధి : గాంధీ యువజన సమైక్య ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారని తెలిపా రు.కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గాంధీ యువజన సమైక్య ఆధ్వర్యంలో వారి 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అష్టాదశ (18) శక్తి పీఠాలను ప్రతిష్ఠించి, నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవ త్సరం లాగే ఈ సంవత్సరం ఉత్సవాలు పండుగ వాతావరణాన్ని నింపాయి.ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు..11 రోజు ల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రతిరోజు అమ్మవా రికి ప్రత్యేక అవతార అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృ తిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం, ఐదవ రోజు విశ్వహిందూ పరిషత్ రామారెడ్డి ప్రగండశాఖ వారిచే హనుమాన్ చాలీసా పారాయణం చశారు దుర్గమాత కొలుపు నేరెళ్ల వారి బృందంచే దుర్గమా త కొలుపు కార్యక్రమం నిర్వహించారు.సామూహిక కుంకుమ పూజ ఈ కార్యక్రమంలో 12 మంది దంప తులు పాల్గొన్నారు.సామూహిక దుర్గామాత యజ్ఞం ఇందులో 20 మంది దంపతులు జంటలు పాల్గొని యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు.సా మూహిక సత్యనారాయణ వ్రతాలు,12 మంది దంపతులు పాల్గొని ఈ వ్రతాలను విజయవంతం చేశారు.భజన కార్యక్రమం శ్రీ రేణుక దేవి భజన మండలి వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజారి దిలీప్ కుమార్ పంతులు పూజ కార్యక్రమం, ఒక్కొ క్క అవతారాన్ని గురించి సంపూర్ణంగా వివరించా రు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా వేలంపాట పాడి పలువురు మాత ధరించిన చీరలను దక్కిం చుకున్నారు.ఈ వేలంపాటలో మహిళలు, మాల స్వాములు, కండువా స్వాములు, బాల స్వాము లు, కంకణం స్వాములతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. గాంధీ యువజన సమైక్య పాలకమండలి ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చి సేవలను అందించిన వారికి, ఈ కార్యక్రమాలను నిర్వహించిన పాలక మండలి సభ్యులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ప్రత్యేక బహుమతులు అందిం చారు.భక్తుల మనసులో భక్తి పారవశ్యాన్ని నింపు తూ,పండుగ వాతావరణాన్ని వెదజల్లిన అష్టాదశ దుర్గామాత విగ్రహాలను ఘనంగా నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగిశాయి.

కామారెడ్డి, 04 అక్టోబర్ పున్నమి ప్రతినిధి :

గాంధీ యువజన సమైక్య ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారని తెలిపా రు.కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గాంధీ యువజన సమైక్య ఆధ్వర్యంలో వారి 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అష్టాదశ (18) శక్తి పీఠాలను ప్రతిష్ఠించి, నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవ త్సరం లాగే ఈ సంవత్సరం ఉత్సవాలు పండుగ వాతావరణాన్ని నింపాయి.ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు..11 రోజు ల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రతిరోజు అమ్మవా రికి ప్రత్యేక అవతార అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృ తిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
హనుమాన్ చాలీసా పారాయణం, ఐదవ రోజు విశ్వహిందూ పరిషత్ రామారెడ్డి ప్రగండశాఖ వారిచే హనుమాన్ చాలీసా పారాయణం చశారు
దుర్గమాత కొలుపు నేరెళ్ల వారి బృందంచే దుర్గమా త కొలుపు కార్యక్రమం నిర్వహించారు.సామూహిక కుంకుమ పూజ ఈ కార్యక్రమంలో 12 మంది దంప తులు పాల్గొన్నారు.సామూహిక దుర్గామాత యజ్ఞం ఇందులో 20 మంది దంపతులు జంటలు పాల్గొని యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు.సా మూహిక సత్యనారాయణ వ్రతాలు,12 మంది దంపతులు పాల్గొని ఈ వ్రతాలను విజయవంతం చేశారు.భజన కార్యక్రమం శ్రీ రేణుక దేవి భజన మండలి వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు.
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజారి దిలీప్ కుమార్ పంతులు పూజ కార్యక్రమం, ఒక్కొ క్క అవతారాన్ని గురించి సంపూర్ణంగా వివరించా రు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా వేలంపాట పాడి పలువురు మాత ధరించిన చీరలను దక్కిం చుకున్నారు.ఈ వేలంపాటలో మహిళలు, మాల స్వాములు, కండువా స్వాములు, బాల స్వాము లు, కంకణం స్వాములతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
గాంధీ యువజన సమైక్య పాలకమండలి ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చి సేవలను అందించిన వారికి, ఈ కార్యక్రమాలను నిర్వహించిన పాలక మండలి సభ్యులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ప్రత్యేక బహుమతులు అందిం చారు.భక్తుల మనసులో భక్తి పారవశ్యాన్ని నింపు తూ,పండుగ వాతావరణాన్ని వెదజల్లిన అష్టాదశ దుర్గామాత విగ్రహాలను ఘనంగా నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగిశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.