సత్తుపల్లి
(ఖమ్మం పున్నమి ప్రతినిధి)
ఆగష్టు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో బేతుపల్లి లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ ప్రచారం చేపట్టాలని ఇచ్చిన పిలుపుమేరకు
బీజేపీ మాజీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్
ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ అధ్యక్షులు పాలకొల్లు రోజా రాణి, పాకనాటి హరిబాబు, మునుగొండ స్రవంతి “ఘర్ ఘర్ బీజేపీ” కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభలు శ్రీమతి కరణం పరిణిత తో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వర రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుబిజెపి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ శ్రీ e.v రమేష్ ఒక్కదాని పుల్లారావు యాదవ్, బిజెపి జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవ రావు పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి బిజెపి కార్యకర్త వెళ్లి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపడుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు వివరించి కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి ఇంటికి తెలియచేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు..
➡️ మోదీ పాలనలో దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
➡️ ప్రతి బూత్ అధ్యక్షుడు కనీసం 100 ఇండ్లను సందర్శించి మోదీ సందేశం చెప్పాలన్నారు.
➡️ ఇది కేవలం ప్రచారం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యమమని తెలిపారు.
➡️ గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిలో మునిగిపోయాయని విమర్శించారు.
➡️ బీసీలకు న్యాయం చేయాలని, 42% రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
➡️ మోదీ నాయకత్వంలో అభివృద్ధి, గ్రామీణ సంక్షేమం జరుగుతోందని వివరించారు.
➡️ రేషన్, రోడ్లు, మొక్కలు నాటడం, పీఎం కిసాన్ నిధులు వంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.
“ప్రతి ఇంటికీ బీజేపీ సందేశం – ప్రతి గ్రామానికి అభివృద్ధి”
ఈ కార్యక్రమంలో మంద శివ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆచంట నాగ స్వామి, మాజీ కౌన్సిల్ సభ్యులు మట్ట ప్రసాద్, శివ, సాయి, బండి ఆంజనేయులు, ప్రసాద్, వేంసూర్ మాజీ మండల అధ్యక్షులు పరసా రాంబాబు,పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్,తల్లాడ మండల అధ్యక్షులు నాగులు, ఉబ్బల కృష్ణ, పాల నాగ సురేంద్ర రెడ్డి, వేంసూర్ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మెరుగు శేషగిరిరావు, కార్తీక్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, వెంకట రెడ్డి, శ్రీనివాస్, అశోక్, ఈడ గణేష్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు


