Monday, 23 March 2026
  • Home  
  • గ్రామపంచాయతీ ఎన్నికల దృష్యా రూపొందించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలుపాలన్న : జిల్లా కలెక్టర్
- తెలంగాణ

గ్రామపంచాయతీ ఎన్నికల దృష్యా రూపొందించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలుపాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) గ్రామపంచాయతీ ఎన్నికల దృశ్యా రూపొందించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 (ఆగస్ట్ 30) లోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గ్రామపంచాయతీ వార్డుల వారిగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ పై అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 28న సంబంధిత ఎంపీడీవోల ద్వారా మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలు,వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించడం జరిగిందని, ఈ ముసాయిదా ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలను ఈనెల 28 నుండి 30 వరకు సమర్పించవచ్చని వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 31న పరిశీలించి, పరిష్కరించడం జరుగుతుందని, తుది ఓటర్ జాబితాను సెప్టెంబర్ 2న ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30న (శనివారం )ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ సమావేశంలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై అభ్యంతరాలు తెలుపవచ్చు అని కలెక్టర్ సూచించారు. తుది ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఎన్నికల అధికారి నారాయణ అమిత్ ముసాయిదా వాటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రక్రియను వివరించారు. హాజరైన పార్టీ నాయకులు పలు సూచనలు చేశారు. ముసాయిదా వాటర్ జాబితా కాపీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందుగానే అందించాలని, డబుల్ ఓటర్లను తొలగించాలని, ఏ వార్డులోని ఓటర్లు అదే వార్డులో ఉండేలాగా చూడాలని,ఒక ఇల్లు ఒకే వార్డులో వచ్చేలా చూడాలని, గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని,అభ్యంతరాల సమర్పణకు తేదీ పొడిగించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శులను మార్చాలని కోరారు.

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి)
గ్రామపంచాయతీ ఎన్నికల దృశ్యా రూపొందించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 (ఆగస్ట్ 30)
లోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో కోరారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గ్రామపంచాయతీ వార్డుల వారిగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ పై అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 28న సంబంధిత ఎంపీడీవోల ద్వారా మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలు,వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించడం జరిగిందని,
ఈ ముసాయిదా ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలను
ఈనెల 28 నుండి 30 వరకు సమర్పించవచ్చని వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 31న పరిశీలించి, పరిష్కరించడం జరుగుతుందని, తుది ఓటర్ జాబితాను సెప్టెంబర్ 2న ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30న (శనివారం )ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ సమావేశంలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై అభ్యంతరాలు తెలుపవచ్చు అని కలెక్టర్ సూచించారు. తుది ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఎన్నికల అధికారి నారాయణ అమిత్ ముసాయిదా వాటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రక్రియను వివరించారు.
హాజరైన పార్టీ నాయకులు పలు సూచనలు చేశారు. ముసాయిదా వాటర్ జాబితా కాపీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందుగానే అందించాలని, డబుల్ ఓటర్లను తొలగించాలని, ఏ వార్డులోని ఓటర్లు అదే వార్డులో ఉండేలాగా చూడాలని,ఒక ఇల్లు ఒకే వార్డులో వచ్చేలా చూడాలని, గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని,అభ్యంతరాల సమర్పణకు తేదీ పొడిగించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శులను మార్చాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.