Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mahabubabad

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

Punnami Newsroom Published:
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

డిసెంబర్ 10 వరకు కొత్త దరఖాస్తులు, అభ్యంతరాలకు అవకాశం

మరిపెడ బంగ్లా: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేసింది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 5,68,105 మంది, వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గంలో 6,21,086 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 11,89,191 మంది అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు ముసాయిదా జాబితాలో చోటు పొందారు. ఈ జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరు పరిశీలించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు డిసెంబర్ 10వ తేదీ వరకు కొత్త దరఖాస్తులు, అభ్యంతరాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఫారం-18 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదై ఉన్నవారు కూడా తాజా జాబితాలో తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలి.

అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. తుది ఓటర్ల జాబితా డిసెంబర్ 30న ప్రచురించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు లింక్:
https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx

పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్
మరిపెడ బంగ్లా – మహబూబాబాద్ జిల్లా

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *