గౌరవరం వద్ద బోల్తా పడ్డ లారీ త్రుటిలో తప్పిన ప్రమాదం

0
112

అనంతసాగరం మండలం: గౌరవరం గ్రామం ఎస్సీ కాలనీ వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డ
లారీ
కేతి గుంట క్వారీ నుండి తారు మిక్సర్ లోడుతో ఉప్పలపాడు హైవే రోడ్డు పనులకు తీసుకువెళ్లే లారీ గౌరవరం ఎస్సీ కాలనీ వద్ద బోల్తా పడడం జరిగింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ తప్పించుకో గలిగాడు కానీ ఈ ప్రమాదం జరిగిన పది నిమిషాల ముందు అదే ప్రాంతంలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఈ విషయం గురించి ఆ ప్రదేశం నుండి గ్రామస్తు లను అడగగా కేతిగుంట నుంచి ఉప్పలపాడు వెళ్లే టిప్పర్లు మితిమీరిన వేగంతో వెళుతున్నాయని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, ఇప్పటికే చాలా సార్లు టిప్పర్ డ్రైవర్లకు వాటి యజమానులకు కూడా చెప్పడం జరిగిందని కాని వారు ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదని మితిమీరిన వేగంతో నడపడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా కూడా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి ఎటువంటి ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

0
0