గూడూరు జనసేన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు – మహిళల సత్కారం
గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం మరియు సేవా రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ (POC) మోహన్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్త సృజన, శివాలయం ధర్మకర్త జయలక్ష్మి, వీర మహిళలు తులసి, పెంచలమ్మ, ఆయేషా, పట్టణ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, సుభాన్, సాయికిరణ్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.


