నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జిల్లాలోని వికలాంగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్.పిఆర్.డి. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కుర్మయ్య విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లు పెంచాలని, పెండింగ్ పెన్షన్లను మంజూరు చేయాలని, వికలాంగుల కార్పొరేషన్ ను బలోపేతం చేయాలని మూసివేసిన టీసీపీసీ సెంటర్లను ప్రారంభించాలని కోరుతూ గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మండల కార్యదర్శి మాణిక్యం, గౌరవ అధ్యక్షుడు తిరుపతయ్య, ధర్మయ్య, సురేష్ పాల్గొన్నారు.

గురువారం కలెక్టర్ కార్యాలయం ముట్టడి