*గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడీ సాయిబాబా గుడి వద్ద మహా అన్నదానం*
ఇబ్రహీంపట్నం – పున్నమి ప్రతినిధి (జూలై 9) : కొండపల్లి లోని షిరిడి సాయినాధునికి అత్యంత పవిత్రమైన గురుపౌర్ణమి సందర్భంగా కొండపల్లి పట్టణంలోని ‘బీ’ కాలనీ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుండి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని, పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులందరికీ హారతి మరియు తీర్థ ప్రసాదాలు అందజేస్తామని తెలిపారు కమిటీ సభ్యులు. మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కుల, మతాలకు, అతీతంగా భక్తులు పాల్గొని బాబా వారి తీర్థ ప్రసాదాలు సేవించి, షిరిడి సాయినాధుని దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు.