విజయవాడ(నవంబర్ 11) పున్నమి ప్రతినిధి
ఉమ్మడి కృష్ణాజిల్లా,విజయవాడ :-
గుణదలలో అంబిటస్ వరల్డ్ స్కూలులో షేడ్స్ వార్షికోత్సవ వేడుక 2025 కార్యక్రమాన్ని నవంబర్ 22 వ తేదీ సాయంత్రం పాఠశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డి సి పి కె.జి.వి. సరిత పాల్గొంటున్నారని, వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.శ్రీప్రియ ప్రత్యేకంగా ఆహ్వానించామని, తప్పకుండా పాల్గొంటానని డి సి పి సరిత హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.
కావున విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, అతిరథ మహారధులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని ప్రిన్సిపల్ శ్రీప్రియ కోరారు.


