ఖమ్మం పున్నమి ప్రతినిధి
హైదరాబాదులో షటిల్ ఆడుతూ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. గురువారం రాకేష్ దశదిన కర్మ తల్లాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సండ్ర వెంకట వీరయ్య హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు దంపతులను ఆయన ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని ఆభయం ఇచ్చారు. అనంతరం రాకేష్ ను ఖననం చేసిన ప్రదేశాన్ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షుడు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుగ్గిదేవర వెంకటలాల్, పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు జివిఆర్, నాయకులు దగ్గుల శ్రీనివాస్ రెడ్డి, పెరిక నాగేశ్వరరావు, గుండ్ల నాగయ్య, కోడూరు వీర కృష్ణ, రఘు తదితరులన్నారు.


