అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని గుండ్లూరు గ్రామంలో ముమ్మడి కృష్ణారెడ్డి కుమార్తె తేజస్వి నిశ్చితార్థ వేడుక బుధవారం ఘనంగా నిర్వహించారు.గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా కుటుంబ సభ్యులు,బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను రంగులద్దారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు.నూతన జీవితం ఆరంభిస్తున్న జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం గ్రామ ప్రజలతో ఆత్మీయంగా పలకరించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మదన్ మోహన్ రెడ్డి,మండెం నాగరాజు, టిడిపి దళిత నాయకుడు సాతపల్లి వెంకీ, పార్టీ కార్యకర్తలు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొని వేడుకకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.

గుండ్లూరులో నిశ్చితార్థ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని గుండ్లూరు గ్రామంలో ముమ్మడి కృష్ణారెడ్డి కుమార్తె తేజస్వి నిశ్చితార్థ వేడుక బుధవారం ఘనంగా నిర్వహించారు.గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా కుటుంబ సభ్యులు,బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను రంగులద్దారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు.నూతన జీవితం ఆరంభిస్తున్న జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం గ్రామ ప్రజలతో ఆత్మీయంగా పలకరించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మదన్ మోహన్ రెడ్డి,మండెం నాగరాజు, టిడిపి దళిత నాయకుడు సాతపల్లి వెంకీ, పార్టీ కార్యకర్తలు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొని వేడుకకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.

