నంద్యాల జీవో నెంబర్ 5 వలన బలిజలు మరియు గిరి బలిజలు నష్టపోతారని భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి బలిజ సంఘం పెద్దలు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెంటనే సంబంధిత శాఖ మంత్రి సవిత తో ఫోన్లో మాట్లాడి జీవో నెంబర్ 5 విషయం గురించి చర్చించడం దీని వలన భవిష్యత్తులో సమస్య ఉత్పన్నమయ్య అవకాశముందని వివరించడం తో మంత్రి సవిత మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ జీవోను తటస్థంగా ఉంచామని అమలు చేయడం లేదని రాబోయే కాలంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సరైన నిర్ణయం తీసుకుంటామని ఆమె భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం కాకముందే సరైన సమయంలో పరిష్కరించుకుంటే బాగుంటుందని మంత్రి ఫరూక్ మంత్రి సవిత కు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయంపై చర్చిస్తానని ఇరువురికి నష్టం జరగకుండా చూస్తాననిసంఘీయులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో శెట్టి విజయ్ కుమార్ , ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారాం , తోట రామయ్య , చలం బాబు , గాలి చంద్రశేఖర్ , కొమ్ము శ్రీహరి , గుద్దేటి వెంకటేశ్వర్లు , పల్లె వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు


