కొమురం భీమ్ పున్నమి ప్రతినిధి
*దహెగాం:* మండలం బోర్లకుంట గ్రామానికి చెందిన జుమ్మిడి మధుకర్ రెండు రోజుల క్రితం బోర్లకుంట గ్రామం వద్ద పెద్దవాగులో గల్లంతయ్యారు.
*ఈ రోజు సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు గాలింపు చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి మధుకర్ గల్లంతైన విషయాన్ని ఆరా తీశారు.*
అనంతరం బీబ్రా వద్ద మధుకర్ మృతదేహం దొరికిందనే సమాచారం తెలిసింది.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వహీదుద్దిన్, ఎస్ఐ విక్రమ్, గ్రామస్తులు పాల్గొన్నారు.


