Thursday, 5 February 2026
  • Home  
  • గాయపడిన కానిస్టేబుల్‌కు అండగా నిలిచిన ఎస్సైకి ఘన సన్మానం
- తూర్పు గోదావరి

గాయపడిన కానిస్టేబుల్‌కు అండగా నిలిచిన ఎస్సైకి ఘన సన్మానం

తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి చందు),ఫిబ్రవరి 01: అనపర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన గోతం తమ్మారావు ఇటీవల విధులలో భాగంగా హనుమాన్ జంక్షన్ నుండి వస్తుండగా సిబ్బందితో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అనపర్తి ఎస్సై ఎల్. శ్రీను నాయక్ స్పందించి, ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచే తమ్మారావు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సలహాలు అందిస్తూ, ప్రతిరోజూ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఈ సేవలను గుర్తించి తమ్మారావు సోదరుడు అడ్వకేట్ మల్లికార్జునరావు తాడిపూడి గ్రామంలో ఎస్సై శ్రీను నాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తమ్మారావు మాట్లాడుతూ, ప్రమాద సమయంలో కుటుంబ సభ్యుడిలా అండగా నిలిచి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి చందు),ఫిబ్రవరి 01: అనపర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన గోతం తమ్మారావు ఇటీవల విధులలో భాగంగా హనుమాన్ జంక్షన్ నుండి వస్తుండగా సిబ్బందితో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అనపర్తి ఎస్సై ఎల్. శ్రీను నాయక్ స్పందించి, ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచే తమ్మారావు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సలహాలు అందిస్తూ, ప్రతిరోజూ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.
ఈ సేవలను గుర్తించి తమ్మారావు సోదరుడు అడ్వకేట్ మల్లికార్జునరావు తాడిపూడి గ్రామంలో ఎస్సై శ్రీను నాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తమ్మారావు మాట్లాడుతూ, ప్రమాద సమయంలో కుటుంబ సభ్యుడిలా అండగా నిలిచి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.