విశాఖపట్నం, గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి)
గాజువాకలో మహిళా దొంగల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. గాజువాక బీసీ రోడ్డు పరిధిలోని ఓం జ్యువలరీ షాపులో బంగారం కొనుగోలు నెపంతో వచ్చిన ముగ్గురు మహిళలు చాకచక్యంగా బంగారు వస్తువులను తస్కరించే ప్రయత్నం చేశారు. బంగారాన్ని జడలో దాచుతున్న దృశ్యాన్ని గమనించిన షాప్ నిర్వాహకులు వెంటనే అప్రమత్తమై వారిని పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భోజ నాగమణి, బోజగాని జ్ఞానమ్మ, పోన్నా పద్మగా గుర్తించిన ముగ్గురు మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తస్కరించిన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరిన్ని దొంగతనాల్లో వీరి పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గాజువాక పరిధిలో జ్యువలరీ షాపులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Uploaded Video:



