Friday, 6 February 2026
  • Home  
  • గాండ్లతెలికుల కుల అభివృద్ధి కోసం తిరుపతిలో ఘనంగా ఏజిటియుపిఎస్ఎస్ అంతర్ముఖ సమావేశం
- ఆంధ్రప్రదేశ్

గాండ్లతెలికుల కుల అభివృద్ధి కోసం తిరుపతిలో ఘనంగా ఏజిటియుపిఎస్ఎస్ అంతర్ముఖ సమావేశం

** గాండ్లతెలికుల కుల అభివృద్ధి కోసం తిరుపతిలో ఘనంగా ఏజిటియుపిఎస్ఎస్ అంతర్ముఖ సమావేశం** **కుల ఐక్యతే అభివృద్ధికి మార్గం – రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవ సదస్సుల నిర్వహణకు సంఘం నిశ్చయము** —-వాకాటి *హరికృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు* తిరుపతిలోని ఎన్జీవో హోం ప్రాంగణంలో ఆదివారం **అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సంక్షేమ సంఘం (AGTU-PSS) ఆధ్వర్యంలో ఒక విశిష్ట అంతర్ముఖ సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ ముఖ్యఅతిథులుగా హాజరై, సంఘ సభ్యులకు చైతన్యం కలిగించే సందేశాలను అందించారు.ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుండి గాండ్ల కులానికి చెందిన అనేకమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, యువత, పెద్దలు పాల్గొన్నారు. గాండ్ల కులానికి జరుగుతున్న అపేక్ష, వివక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, తక్షణమే కార్పొరేషన్ కమిటీ ఏర్పాటు చేయడం*ముఖ్య ఎజెండాగా ఈ సమావేశం జరిగింది.వక్తలు తమ ప్రసంగాల్లో గాండ్ల కులానికి సమాజంలో తగిన గుర్తింపు రావడంలో ఇప్పటికీ జాప్యం జరుగుతోందని, పలు నైతిక, రాజకీయ, పరిపాలన రంగాల్లో గాండ్ల కులానికి తగిన ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు. కుల అభివృద్ధి కొరకు ఐక్యత, చైతన్యం, చొరవ అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా గాండ్ల కుల సోదరులందరిని చైతన్యవంతం చేయడానికి ఆత్మగౌరవ సదస్సుల నిర్వహణకు సంస్ధ కార్యాచరణ రూపొందించనుంది. మొదటి ఆత్మగౌరవ సదస్సును తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వహించనుంది.ఈ సమావేశం కుల ఐక్యతకు, చైతన్యానికి బలమైన బాటను వేస్తుందని, సమాజంలో గాండ్ల కులస్థుల అభివృద్ధికి ఇది ఒక మలుపు కావచ్చని పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడారు.మన కులవర్గానికి న్యాయం జరగాలంటే మనం సంఘటితంగా ఉండాలి, గళమెత్తాలి. సంక్షేమం కోసం సంఘర్షించాలి” అని నాయకులు స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక సమావేశం కాదు ఒక ఉద్యమం మొదటి మెట్టు అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో పద్మాకర్, బద్రి, సత్యనారాయణ, శోలింగర్ గిరి(శ్రీనివాస్)బాబు,మురళి మనోజ్, దేవరకొండ భాస్కర్, చెరుకుపల్లి ఈశ్వరయ్య*,చెంచు కృష్ణయ్య, రెడ్డి శేఖర్, బాలనారాయణస్వామి , సుధీర్, ఆనందబాబు పచ్చార్ల సుధాకర్, దేవ సుబ్రహ్మణ్యం,మధు, లెజెండ్ రామచంద్ర, రెడ్డి రమేష్, గాండ్ల కన్నయ్య,అశోక్, రుద్ర గోపి, వెంకటయ్య, చంద్రశేఖర్ ఉదయ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

** గాండ్లతెలికుల కుల అభివృద్ధి కోసం తిరుపతిలో ఘనంగా ఏజిటియుపిఎస్ఎస్ అంతర్ముఖ సమావేశం**

**కుల ఐక్యతే అభివృద్ధికి మార్గం – రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవ సదస్సుల నిర్వహణకు సంఘం నిశ్చయము** —-వాకాటి *హరికృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు*

తిరుపతిలోని ఎన్జీవో హోం ప్రాంగణంలో ఆదివారం **అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సంక్షేమ సంఘం (AGTU-PSS) ఆధ్వర్యంలో ఒక విశిష్ట అంతర్ముఖ సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ ముఖ్యఅతిథులుగా హాజరై, సంఘ సభ్యులకు చైతన్యం కలిగించే సందేశాలను అందించారు.ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుండి గాండ్ల కులానికి చెందిన అనేకమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, యువత, పెద్దలు పాల్గొన్నారు. గాండ్ల కులానికి జరుగుతున్న అపేక్ష, వివక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, తక్షణమే కార్పొరేషన్ కమిటీ ఏర్పాటు చేయడం*ముఖ్య ఎజెండాగా ఈ సమావేశం జరిగింది.వక్తలు తమ ప్రసంగాల్లో గాండ్ల కులానికి సమాజంలో తగిన గుర్తింపు రావడంలో ఇప్పటికీ జాప్యం జరుగుతోందని, పలు నైతిక, రాజకీయ, పరిపాలన రంగాల్లో గాండ్ల కులానికి తగిన ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు. కుల అభివృద్ధి కొరకు ఐక్యత, చైతన్యం, చొరవ అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా గాండ్ల కుల సోదరులందరిని చైతన్యవంతం చేయడానికి ఆత్మగౌరవ సదస్సుల నిర్వహణకు సంస్ధ కార్యాచరణ రూపొందించనుంది. మొదటి ఆత్మగౌరవ సదస్సును తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వహించనుంది.ఈ సమావేశం కుల ఐక్యతకు, చైతన్యానికి బలమైన బాటను వేస్తుందని, సమాజంలో గాండ్ల కులస్థుల అభివృద్ధికి ఇది ఒక మలుపు కావచ్చని పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడారు.మన కులవర్గానికి న్యాయం జరగాలంటే మనం సంఘటితంగా ఉండాలి, గళమెత్తాలి. సంక్షేమం కోసం సంఘర్షించాలి” అని నాయకులు స్పష్టం చేశారు.
ఇది కేవలం ఒక సమావేశం కాదు ఒక ఉద్యమం మొదటి మెట్టు అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో పద్మాకర్, బద్రి, సత్యనారాయణ, శోలింగర్ గిరి(శ్రీనివాస్)బాబు,మురళి మనోజ్, దేవరకొండ భాస్కర్, చెరుకుపల్లి ఈశ్వరయ్య*,చెంచు కృష్ణయ్య, రెడ్డి శేఖర్, బాలనారాయణస్వామి , సుధీర్, ఆనందబాబు పచ్చార్ల సుధాకర్, దేవ సుబ్రహ్మణ్యం,మధు, లెజెండ్ రామచంద్ర, రెడ్డి రమేష్, గాండ్ల కన్నయ్య,అశోక్, రుద్ర గోపి, వెంకటయ్య, చంద్రశేఖర్ ఉదయ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.