*గణిత శాస్త్రంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహణ*
విశాఖపట్నం, డిసెంబర్ 23,పున్నమి ప్రతినిధి:-
*భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి (జాతీయ గణిత దినోత్సవం 2025)ను పురస్కరించుకుని, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర మరియు అనువర్తిత గణిత శాస్త్ర విభాగాల సంయుక్తంగా “గణిత శాస్త్రంలో ప్రస్తుత ధోరణులు” (Current Trends in Mathematics) అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ అసాధారణ జీవితం మరియు ఆయన చేసిన పరిశోధనల స్ఫూర్తితో ఈ సదస్సును నిర్వహించారు* .
*ముగింపు కార్యక్రమానికి ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ హాజరయ్యారు. సదస్సులో భాగంగా గౌరవ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ “గ్రీన్స్ ఫంక్షన్ మెథడ్స్ టు సాల్వ్ లాప్లీస్ ఈక్వేషన్” అనే అంశంపై ప్రసంగించారు. భారతీయ గణిత శాస్త్రవేత్తల కృషిని నేటితరం తెలుసుకోవాలని, వారి వారసత్వాన్ని కొనసాగించే దిశగా విలువైన పరిశోధనలు జరపాలని సూచించారు* .
*కోల్కతాలోని RKMVERI యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ అధికారి “ఎర్లీ రామ్సే టైప్ థియరమ్స్” అనే అంశంపై విద్యార్థులకు, పరిశోధకులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు కాలానుగుణగా జరుగుతున్న శాస్త్రవిజ్ఞాన ప్రగతిని తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు.* పరిశోదన రంగంలో అడుగిడాలని యువతకు సూచించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రధానంచేసి అభినందించారు.
ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు ఆధునిక గణిత శాస్త్రంలో వస్తున్న మార్పులపై లోతైన అవగాహన కలిగించడానికి ఉపయుక్తంగా నిలచిందని విభాగాధిపతి ఆచార్య అనురాధ కామేశ్వరి తెలిపారు. కార్యక్రమంలో డీన్ ఆచార్య రాజేంద్రప్రసాద్, ఆధార్య పి.డి. ఎన్ శ్రీనివాసు, విభాగ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సదస్సును సోమవారం ఉదయం ఐఐటీ గౌహతి కి చెందిన ప్రొఫెసర్ కె.వి. కృష్ణ ప్రారంభించి “వర్డ్-రిప్రజెంటబుల్ గ్రాప్స్” (Word-Representable Graphs) అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం డాక్టర్ ఎన్. రామకృష్ణ “అసింష్టోటిక్ రెగ్యులారిటీ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ సర్టైన్ మోనోమియల్ ఐడియల్స్” అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశాడు. మధ్యాహ్నం సెషన్లో ఐఐపీఈ, విశాఖపట్నం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. రామునాయుడు “వేర్ AI మీట్స్ కంప్రెస్డ్ సెన్సింగ్: ఎ టూ వే రివల్యూషన్” అనే అంశంపై ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ‘ఇంటెలిజెన్స్ రంగంలో గణితం పాత్రను ఆయన వివరించారు. అనంతరం రెండు విభాగా విద్యార్ధులకు క్విజ్ పోటీలను నిర్వహించారు.


