గంగవరం వద్ద అదుపుతప్పిన మినీ వ్యాన్ పంటచేలోకి పడిపోయింది
బుచ్చిరెడ్డిపాలెం: కడప నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న టాటా ఏసీ మినీ వ్యాన్ (AP 39UN 9105) గంగవరం ఎస్-టర్నింగ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పంటచేలోకి పడిపోయింది. నిన్న రాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదే దారిలో వెళ్తున్న సిమెంట్ లారీ ఓవర్టేక్ చేస్తుండగా, వెనుకభాగం ట్యాంకర్ తగలడంతో మినీ వ్యాన్ అదుపుతప్పిందని డ్రైవర్ తెలిపాడు. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. లారీ ఆపకుండా వెళ్లిపోయినట్టు సమాచారం.