గంగామ్మ బ్రిడ్జి సైడ్ వాల్ వద్ద పక్క గోతి ఏర్పడడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు పత్రిక ముఖంగా మాట్లాడు తూ, కామారెడ్డి జిల్లాలో అనేక బ్రిడ్జిలు, ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, వర్షాలకు, పనుల ఆలస్యం లేదా నాణ్యత లోపాలకు గురవు తూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయ ని అన్నారు.రామారెడ్డి ప్రధాన రహాదారి గంగమ్మ బ్రిడ్జి సైడ్ వాల్ కూలడం, ఇది పాదచారులు, ద్విచ క్ర వాహనదారులకు రక్షణ లోపించి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. దీని మూలంగా ప్రజలు అసౌకర్యాన్ని చవిచూస్తున్నారని ఆరోపిం చారు. బ్రిడ్జి వాల్ మట్టి కూలడం వల్ల చిక్కులు, ప్రమాద భయం పెరిగిందన్నారు. వాహన దారులు, కాలిన డక ప్రయాణికులకు రహదారి పొడవునా ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు.వర్షాకాలంలో బ్రిడ్జి ప్రాంతంలో నీటి ప్రవాహం పెరగడం, మరింత ప్రమాదాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఇటువంటి సమస్యలకు సంబంధించి సాధారణంగా గ్రామ పంచాయతీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రహదారి ప్రమా దాలను నివారించేందుకు తాత్కాలిక నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
తాత్కాలికంగా కనీసం రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పూర్తిగా వాల్ మరమ్మతులు పునర్నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని అన్నారు.
అనుకోని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల ని అన్నారు. ప్రస్తుతం గంగామ్మ బ్రిడ్జి వంటి వరదనష్టం, వాల్ పెగడం వంటి అసౌకర్యాలు ప్రజ జీవనంపై తక్షణ ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులు ఎమ్మెల్యే చొరువ తీసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గంగమ్మ బ్రిడ్జి పూర్తి నిర్మాణం చేపట్టా లని కోరారు. ఈకార్యక్రమంలో నర్సారెడ్డి, ల్యాగల మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.


